‘సరిలేరు నీకెవ్వరు’ 75 % అయిపోయిందా ?

SariLeruNeekevvaru2

సూపర్ స్టార్ మహేష్ బాబు’ – అనిల్ రావిపూడి – కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ 75 శాతం పూర్తి అయిందని తెలుస్తోంది. కాగా మహేష్ అప్పుడే అంత షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక మహేష్ బాబు ఎప్పుడు సెలవులు వచ్చినా తన కుటుంబంతో విదేశాలకు వెళ్తారు. దుబాయ్ మహేష్ బాబుకు ఇష్టమైన హాలిడే స్పాట్. సమయం దొరికినప్పుడల్లా మహేష్ తరచూ అక్కడకి వెళ్తుంటారు. కాగా ప్రస్తుతం మహేష్ తన భార్య మరియు పిల్లలతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్ళారు. మహేష్ తిరిగి వచ్చాక, ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాడట.

కాగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్ లో కనిపించనుందట. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తుందట. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version