యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం ఇద్దరిలోకం ఒకటే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తుండగా నూతన దర్శకుడు జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో మొదలైన ఈ చిత్రం ఎందుకో ఆలస్యం అయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
కాగా రేపు ఇద్దరి లోకం ఒకటే మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఉయ్యాలా జంపాలా వంటి హిట్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్తమామ వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. ఐతే రాజ్ తరుణ్ హిట్ అందుకొని చాలా రోజులవుతుంది. అందుకే ఈ చిత్రంపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నారు.
