ఆ ఆఫర్ ఓ.కే అయితే త్రిషా బంపర్ ఛాన్స్ కొట్టినట్లే…!

Trisha

గత ఏడాది 96 మూవీతో సూపర్ హిట్ అందుకుంది త్రిష. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలు చేస్తుంది. ఈ ఏడాది రజిని సరసన పేట మూవీలో నటించిన త్రిషకు మరో బంపర్ ఆఫర్ తగిలిందని సమాచారం. లెజెండరీ దర్శకులు మణిరత్నం తెరకెక్కించనున్నభారీ పీరియాడిక్ మూవీ పొన్నియిన్ సెల్వం లో ఓ పాత్ర కొరకు త్రిషను తీసుకొనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని సమాచారం.

ఒక పాత్రకు త్రిష సరిపోతుందని భావించిన వీరు ఆమెతో చర్చలు జరిపేయోచనలో ఉన్నారట. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఇప్పటికే ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, మోహన్ బాబు వంటి భారీ కాస్ట్ ఈ చిత్రంలో భాగమయ్యారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకెళ్లనుంది. కల్కి కృష్ణ మూర్తి రాసిన చోళుల చారిత్రక నవల ఆధారంగా ఈ మూవీని మణిరత్నం రూపొందించనున్నారు.

Exit mobile version