విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘యాక్షన్’. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేయనున్నారు. దీపావళి సందర్బంగా విడుదలైన ఈ సినిమా యొక్క తమిళ ట్రైలర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇక తెలుగు వెర్షన్ కోసం కూడా ఒక ట్రైలర్ రెడీ చేశారు టీమ్.
దీన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ కథానాయకలుగా నటిస్తున్నారు. మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకొని రూపొందించిన ఈ సినిమాలో విశాల్ కల్నల్ సుభాష్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా నవంబర్ నెలలోనే విడుదలకానుంది.
