సీనియర్ హీరో డా. రాజశేఖర్ హీరోగా ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ నవంబర్ 15న నుండి మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఎమోషనల్ సాగే ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారు.
ఇక రాజశేఖర్ గరడవేగ, కల్కి లాంటి హిట్స్ తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఉంటాయి. 2020 సమ్మర్ లో ఈ సినిమాను విడుదల కానుంది. మరి రాజశేఖర్ కి తన కెరీర్ లో ‘గరుడవేగ’ చిత్రంలాగే ఈ చిత్రం కూడా మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందేమో చూడాలి.
