స్టార్ వారసుడితో నిధి రొమాన్స్ !

Nidhhi Agerwal2

పాపం అవసరానికి మించి అందాలను ఆరబోసిన కొంతమంది హీరోయిన్లకు మాత్రం, అదృష్టం ఏ మాత్రం మొహమాట పడకుండా కాస్త ఎక్కువగానే వారితో గ్యాప్ ను మెయింటైన్ చేస్తోంది. అలాంటి హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకటి. పేరుకి తగ్గట్లుగానే త‌న అందాల సోయ‌గాల‌తో కుర్రకారును బాగానే ఆక‌ట్టుకుంటున్నా.. అమ్మడుకు పెద్ద ఛాన్స్ లేమి రావట్లేదు.

అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనుకుండా ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటుంది. ఈ క్రమంలోనే నిధి ఓ డెబ్యూ హీరోతో క‌లిసి న‌టించ‌నుంది. వివ‌రాల్లోకెళ్తే.. సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వహించనున్నాడు. త్వ‌ర‌లోనే సెట్స్‌ పైకి వెళ్ల‌బోయే ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం నిధి త‌మిళంలో జ‌యం ర‌వి 25వ సినిమాలో నటిస్తోంది.

Exit mobile version