కలిసొచ్చిన జోనర్లో అనుష్క బ్లాక్ బస్టర్ కొడుతుందా..!

Anushka Shetty

అనుష్క శెట్టి దాదాపు పూర్తి స్థాయి సినిమాలో కనిపించి ఏడాది దాటిపోయింది. గత ఏడాది విడుదలైన భాగమతి చిత్రం తరువాత అనుష్క ఏ చిత్రంలో కనిపించలేదు. ఐతే ఇటీవల విడుదలైన సైరా చిత్రంలో గెస్ట్ రోల్ లో తళుక్కున మెరిశారు. కాగా అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో నటించిన నిశ్శబ్దం మూవీ టీజర్ నిన్న విడుదలైంది.

ఒక యంగ్ కపుల్ రొమాంటిక్ టూర్ భయానకంగా మారుతుంది. ప్రకృతిలో ఆహ్లాదంగా గడుపుదామనుకున్న ఆ ప్రేమికుల వెకేషన్ వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది…, అన్నట్లు ఆ టీజర్ సాగింది.నిశబ్దం మూవీ హారర్ అండ్ సస్పెన్సు థ్రిల్లర్ అని టీజర్ చెప్పకనే చెవుతుంది. ఐతే ఇప్పటివరకు ఈ మూవీ ఆర్ట్ ఫిల్మ్ గా అందరూ అనుకున్నారు. అనుష్క పాత్రను పెయింటర్ గా, మాధవన్ రోల్ ను వయిలిన్ కళాకారుడిగా పరిచయం చేయడమే ఇందుకు కారణం. కాగా నిన్నటి టీజర్ తో ఈ అభిప్రాయాలను మార్చివేశారు. ఐతే టీజర్ ఆసక్తికరంగా ఉత్కంఠ రేపేదిలా ఉంది. అనుష్క కు హారర్ కలిసొచ్చిన జోనర్. ఆమె నటించిన అరుంధతి ట్రెండ్ సెట్టర్ కాగా, భాగమతి చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

Exit mobile version