‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాల దర్శకుడు విరించి వర్మతో కళ్యాణ్ రామ్ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా విరించి వర్మ నందమూరి కళ్యాణ్ రామ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడట. స్క్రిప్ట్ కూడా కళ్యాణ్ రామ్ కి వినిపించినట్లు తెలుస్తోంది. అయితే కళ్యాణ్ రామ్ కి కథ నచ్చినా.. ఇప్పటికే అంగీకరించిన సినిమాల కారణంగా ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేశాడట.
కాగా ఈ లోపు దర్శకుడికి వేరే సినిమా చేసుకొని రమ్మని చెప్పినట్లు సమాచారం. దాంతో విరించి వర్మ వరుణ్ తేజ్ కి కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఒకవేళ వరుణ్ తేజ్ అంగీకరించకపోతే.. విరించి వర్మ రాజ్ తరుణ్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి ‘ఉయ్యాల జంపాల’తో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా చూడాలి.
