మథనం మూవీ ‘చందమామ..’ సాంగ్ టీజర్ విడుదల

Madhanam

శ్రీనివాస సాయి, భావన రావ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం మథనం. దర్శకుడు అజయ్ సాయి మనకందన్ యూత్ ఫుల్ మరియు ఎమోషన్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. కాశి ప్రొడక్షన్స్ బ్యానర్ పై దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా నేడు ఈ మూవీలోని చందమామ…చందమామ’ అనే లిరికల్ సాంగ్ టీజర్ విడుదల చేశారు చిత్ర బృందం.

అమ్మాయి ప్రేమకోసం ఆవేదన పడుతున్న హీరో పాడే ట్రాజిక్ సాంగ్ అని సాంగ్ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. సంగీత దర్శకుడు రాన్ ఈతాన్ యోహాన్ ఈపాటకు అద్భుతమైన స్వరాలు సమకూర్చగా, సింగర్ కార్తీక్ చాలా హృద్యంగా పాడారు. ఈనెల 27న 10:30 నిమిషాలకు ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో విడుదల కానుంది.

Exit mobile version