వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘వెంకీ మామ’ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. దగ్గుబాటి, అక్కినేని అభిమానులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఘనమైన ఆక్యుపెన్సీను సొంతం చేసుకుంది. వెంకీ మరియు చైతు ఇద్దరికీ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కాగా ఏపి & తెలంగాణ లో ఈ సినిమాకి మొదటి రోజు 7.02 కోట్ల రూపాయల థియేటర్ షేర్ వచ్చింది.
ఏరియాల వారిగా మొదటి రోజు కలక్షన్ల షేర్ వివరాలు
| ఏరియ | కలెక్షన్స్ |
| నైజాం | Rs 2.29 కోట్లు |
| సీడెడ్ | Rs 1.60 కోట్లు |
| ఉత్తరాంధ్ర | Rs 0.87 కోట్లు |
| ఈస్ట్ | Rs 0.60 కోట్లు |
| వెస్ట్ | Rs 0.30 కోట్లు |
| కృష్ణ | Rs 0.37 కోట్లు |
| గుంటూరు | Rs 0.72 కోట్లు |
| నెల్లూరు | Rs 0.27 కోట్లు |
| మొత్తం ఏపి & తెలంగాణ మొదటి రోజు షేర్ | Rs 7.02 కోట్లు |
