‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్ !

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ విజయానందంలో ఉన్నారు. ఐతే, తన కెరీర్ లోనే భారీ బడ్జెట్‌తో రూపొందే ఓ పౌరాణిక చిత్రం కోసం ఆయన ప్రేరణ అరోరా మరియు జీ స్టూడియోస్‌తో జతకట్టారన్న విషయం తెలిసిందే. ఐతే, ఈ చిత్రానికి ‘ఇంద్రపుత్ర’ అని పేరు పెట్టినట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ పుప్పాల ఈ పాన్-ఇండియా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. కీర్తన్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం, నిర్మాతలు ప్లాన్ చేస్తున్న పౌరాణిక ప్రపంచంలో మొదటి భాగం కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.

Exit mobile version