మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ‘సైరా’తో పాన్ ఇండియా మూవీ చేసిన మెగాస్టార్.. ఇప్పుడు కొరటాల శివతో చేయబోయే సినిమాని కూడా పాన్ ఇండియా మూవీగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని నిర్మిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు అందుకు తగ్గట్లుగానే సినిమా బడ్జెట్ ను భారీగా పెంచనున్నారట.
కాగా హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. కొరటాల ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి… సినిమాని 2020లో స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ గా ఆగస్టు 14న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోన్నారట. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషనే హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక దేవాదాయ శాఖలో అవినీతి పై సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట కొరటాల.
