వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద తన బలమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ హారర్ కామెడీ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 20 కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు కూడా ఈ చిత్రం తన జోరును అలాగే కొనసాగించింది. మొదటి రెండు రోజులతో పోలిస్తే మూడవ రోజు మెరుగైన వసూళ్లను నమోదు చేసింది. మొత్తానికి మొదటి వీకెండ్ ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ చిత్రం సాధించిన మొత్తం వారాంతపు వసూళ్ల పైనే ఉంది.
ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా యంగ్ హీరోయిన్ రితికా నాయక్ వరుణ్ తేజ్ సరసన నటించింది. ఈ చిత్రంలో సత్య, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్, చిన్న తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. అన్నట్టు రెండో వారంలో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఈ సినిమాకి బాగా డిమాండ్ ఉంది.
