యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ రోజు షూటింగ్ తోటి ముగిసింది. ఈ విషయాన్ని దర్శకుడు సంపత్ నంది ట్వీట్ తో ధృవీకరిస్తూ ‘నా కోచ్ అండ్ కబడ్డీ టీంతో సాగిన 15 రోజుల మొదటి షెడ్యూల్ షూటింగ్ ను అద్భుతమైన విజువల్స్ అండ్ అంశాలతో చిత్రీకరించాము. అవుట్ ఫుట్ విషయంలో చాల సంతోషకరంగా ఉన్నాము’ అని ఫిల్మ్ యూనిట్ తో దిగిన గ్రూప్ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా చేస్తోంది.
కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. కాగా ‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (ప్రొడక్షన్ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.
It’s a wrap of 15 days of first schedule.
Shot some amazing stuff with my coach n Kabaddi team!
Our happy faces should say it all ????#Gopichand28 #Tamannaah #SrinivasaaSilverscreen pic.twitter.com/EkcI66B4wR
— Sampath Nandi (@IamSampathNandi) December 29, 2019
