‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!

raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘రాకా’. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ గ్రాండ్ లెవెల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదొక అప్డేట్ కావాలని గత కొన్ని రోజులు నుంచి అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే లేటెస్ట్ గా వైజాగ్ లో తన మల్టిప్లెక్స్ ఓపెనింగ్ లో ఐకాన్ స్టార్ మాట్లాడుతూ తానే స్వయంగా రాకా పై అప్డేట్ అందించారు. ప్రస్తుతం తాను ముంబైలో జరుగుతున్న రాకా షూట్ నుంచే వచ్చానని, ఇలా తన థియేటర్ ఓపెనింగ్ ఉంది అంటే షూట్ మధ్యలో ఆపి చిత్ర యూనిట్ ని అడిగి ఈ ఒక్కరోజు వచ్చినట్టుగా బన్నీ తెలిపాడు.

అంతే కాకుండా ఇలా వచ్చి మళ్ళీ వెంటనే షూట్ లో పాల్గొనాలని ఓ క్లారిటీ ఇచ్చారు. సో బన్నీ పై సన్నివేశాలే ఇప్పుడు ముంబైలో చిత్రీకరణ చేస్తున్నారని ఓ క్లారిటీ ఫ్యాన్స్ కి ప్రస్తుతానికి వచ్చింది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version