బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఛపాక్’. యాసిడ్ అటాక్ బాధితులకు అండగా సోషల్ మెస్సేజ్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా యాసిడ్ అట్టాక్ బాధితురాలి పాత్ర చేశారు. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఐతే నిన్ననే ఈ చిత్ర ప్రీమియర్ షో లు ప్రదర్శించారు. ఛపాక్ మూవీ చూసిన దీపికా భర్త రణ్వీర్ సింగ్ భార్యను మరియు దర్శకురాలు మేఘనా గుల్జార్ ని ప్రశంశలతో ముంచెత్తారు.
మేఘన.. మీరు తెరకెక్కించిన ఈ చిత్రం జీవితం మీద ఆశను, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఎన్నో విషయాలను అర్థవంతంగా చూపించారు. యాసిడ్ దాడి బాధితులు ఎదుర్కొనే సమస్యలను ప్రతీ ఒక్కరికీ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది.. వెల్‌డన్ మేఘన.. అని అభినందించాడు. దీపికా నువ్వు ఈ చిత్రం కోసం చాల కష్టపడ్డావు అని రన్వీర్ దీపికను పొగిడేశాడు. ఛపాక్ చిత్రాన్ని దీపికా స్వయంగా నిర్మించారు.
