మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. గాంధీ మేర్లపాక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎంటర్‌టైనర్, యూఎస్‌ఏలో ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది.
అక్కడ ఇప్పటికే ఈ సినిమా 200K డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా అక్కడ మరింత సాలిడ్ రన్‌ను కంటిన్యూ చేయనుండటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓవర్సీస్ విడుదల బాధ్యతలను నిర్వహించగా, అన్ని థియేటర్లలో పాస్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు.
రితిక నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి థమన్ అందించిన సంగీతం, యూవీ క్రియేషన్స్ నిర్మాణం అదనపు ఆకర్షణగా నిలిచాయి. యుఎస్‌ఏ ఆడియెన్స్ ఈ కామెడీ థ్రిల్లర్‌కు బ్రహ్మరథం పడుతుండటంతో రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరింత భారీ వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది
