ప్రతి సినిమా ఓ అందమైన జర్నీ- రాశి ఖన్నా

Raashi Khanna 1
వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేసి తప్పు చేశాను, ఆ మూవీలో నటించకుండా ఉండాల్సింది అని రాశి బాధపడుతున్నారని వస్తున్న వార్తలకు రాశి ఖన్నా చెక్ పెట్టారు. ట్విట్టర్ వేదిగా ఆమె ప్రతి సినిమా ఓ అందమైన జర్నీ. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి. జయయాపజయాలు సర్వ సాధారణం, దర్శక నిర్మాతలకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అన్నారు. ఎవరైనా సినిమా విజయం సాధించాలని శక్తికొద్దీ ప్రయత్నిస్తారు అని రాశి ఖన్నా పరోక్షంగా చెప్పుకొచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం కొద్దిరోజుల క్రితం భారీ అంచనాల మధ్య విడుదలైంది. నలుగురు హీరోయిన్స్ తో భిన్నమైన ప్రేమ కథల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్న అంచనాలు అందుకోలేక పోయింది. తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైన ఈ మూవీ రెండు భాషలో పరాజయం పొందింది.

Exit mobile version