విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : మాధవ్ భూపతిరాజు, దీపా బాలు, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, V.S. రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి
దర్శకత్వం : మంచాల నాగరాజ్
నిర్మాత : మయూర్ రెడ్డి బండారు
సంగీత దర్శకులు : ప్రశాంత్ ఆర్. విహారి, బిప్రదీప్ దత్తా
ఛాయాగ్రహణం : ప్రశాంత్ అంకిరెడ్డి
కూర్పు : సాయి బాబు తలారి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ తో సెన్సేషనల్ హిట్ కొట్టగా ఇక ఈ వారం తమ కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో మాధవ్ భూపతి రాజు నటించిన విలేజ్ డ్రామా ‘మారెమ్మ’తో అదృష్టం పరీక్షించుకోడానికి వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తెలంగాణాలోని మహిషాపురం అనే కుగ్రామంలో జరిగే స్థానిక సంప్రదాయాలు, పండుగలలో భాగంగా అక్కడి గ్రామస్తులు ‘మారెమ్మ’ అనే అమ్మవారికి ఓ దున్నపోతుని బలిదానం ఇవ్వడం సంప్రదాయంగా చేస్తూ ఉంటారు. అయితే అదే గ్రామానికి చెందిన కర్ణి (మాధవ్ భూపతిరాజు) పెంచిన దున్నపోతుని ఈసారి బలివ్వడానికి సిద్ధం చేస్తారు. కానీ ఊహించని విధంగా ఆ దున్నపోతు మిస్సవుతుంది. ఇక అక్కడ నుంచి పరిస్థితులు ఎలా మారాయి? మళ్ళీ అది దొరికిందా లేదా? బలి జరగకపోతే ఆ ఊరికి ఏమన్నా అవుతుందా? ఆ గ్రామస్తులు, కర్ణి ఏం చేశారు అనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో తెలంగాణ నేపథ్యానికి చెందిన పలు అంశాలు మెప్పిస్తాయి. అక్కడి సాంప్రదాయ విలువలు, ముఖ్యంగా జానపద పాటలు ఇంప్రెస్ చేసాయి. ఫస్టాఫ్ లో వీటిని బాగా ప్రెజెంట్ చేశారు.
ఇక యువ నటుడు మాధవ్ భూపతిరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. పాత్రకి తగ్గట్టుగా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ ఇందులో బాగున్నాయి. అయితే రచనా లోపం వల్ల అతని ప్రతిభకు తగ్గ స్కోప్ దక్కలేదు కానీ తన వరకు సిన్సియర్ పెర్ఫామెన్స్ ని తాను చేసాడు. అలానే యంగ్ హీరోయిన్ దీపా బాలు పల్లెటూరి అమ్మాయిగా డీసెంట్ లుక్స్, నటనతో ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్:
ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది, ఈ చిత్రం అసలు ప్రేక్షకులకు ఏం చెప్పాలి అనుకుంటుందో అనే పాయింట్ స్ట్రగుల్ అవుతూ వెళుతున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు అసలు ప్రేక్షకులకు నిజంగా ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం కానీ రీతిలో సాగుతుంది. జంతు బలుల గురించి ఏదైనా సందేశం ఇవ్వాలని తాను భావించి ఉంటే, ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కాలేదు.
సెకండాఫ్ అంతా తప్పిపోయిన పవిత్ర దున్నపోతును వెతికే క్రమంలోనే సాగుతుంది, కానీ ఇక్కడ స్క్రీన్ ప్లే చాలా చప్పగా, బోర్ కొట్టించే సన్నివేశాలతో నిండిపోయింది. ఇలాంటి సీన్స్ మూమెంట్స్ ని ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా మలచాల్సి ఉంటుంది. కానీ ఇవి సెకండాఫ్ లో బాగా మిస్ అయ్యాయి. అలానే సీన్ టు సీన్ కనెక్షన్ కూడా మిస్ అయినట్టు కనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్‌లో కూడా కొన్ని బోరింగ్ మరియు రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి. అలాగే హీరోపై డిజైన్ చేసుకున్న ఓ ఎమోషనల్ పాయింట్ ని ఇంకాస్త లోతుగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే, సినిమా చాలా బాగుండేది.
విలన్ ట్రాక్ మొత్తం చాలా పేలవంగా ఉంది. చేతబడి ఎపిసోడ్స్ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. కథనం చాలా వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాదాసీదాగా, బోరింగ్‌గా సాగడమే ఈ చిత్రానికి అతిపెద్ద మైనస్ గా మారింది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ఓకే రేంజ్ లో ఉన్నాయి. ప్రశాంత్ విహారి, బిప్రదీప్ దత్తా తమ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ప్రశాంత్ అంకిరెడ్డి కెమెరా వర్క్ కూడా ఓకే. ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది.
ఇక దర్శకుడు మంచాల నాగరాజ్ దర్శకత్వం విషయానికి వస్తే. తన రచన, దర్శకత్వం రెండిట్లోనూ లోపాలు ఉన్నాయి. రెండు కూడా ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకోలేదు. అసలు తన కథనం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అర్ధం కానీ రీతిలో సాగదీతగా నడిపించారు. సో తన వర్క్ ఈ చిత్రానికి డిజప్పాయింట్ చేస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకుంటే ‘మారెమ్మ’ అనేది స్పష్టత లేని ఒక బోరింగ్ రూరల్ డ్రామాగా నిలిచింది. సినిమా కథనం ఆద్యంతం నీరసంగానే సాగుతుంది. ఎలాంటి హై, ఎమోషనల్ మూమెంట్స్ లేకుండా చప్పగా నడిపించడం డిజప్పాయింట్ చేస్తుంది. యువ నటుడు మాధవ్ తన మొదటి సినిమా అయినా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ పేలవమైన రచన మరియు దర్శకత్వం వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team
