దాసరి పై ‘మెగాస్టార్’ అద్భుత వర్ణన !

dasar chiru4a

‘దిగ్దర్శకుడు, దర్శకరత్న డా. దాసరి నారాయణరావు’ జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో దాసరిగారిని గుర్తుకు తెచ్చుకున్నారు. మెగాస్టార్ దాసరిగారి గురించి ట్వీట్ చేస్తూ.. ‘దా.. దానంలో కర్ణుడు మీరు, స.. సమర్ధతలో అర్జునుడు మీరు, రి.. రిపువర్గమే లేని ధర్మరాజు మీరు, మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మీరే మార్గ దర్శకమవుతారు’ అని ఓ ఫోటోను పోస్ట్ చేసి.. ‘గురువుగారితో ఇది నా చివరి జ్ఞాపకం. మిస్ యు సర్’ అని మెగాస్టార్ దాసరిగారిని అద్భుతంగా వర్ణిస్తూ ట్వీట్ చేశారు.

ఇక ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి.. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సంచలన విజయాలు సాధించి దర్శకుల విలువను పెంచిన ఆ దిగ్దర్శకుడు 1942, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించారు. దాసరి అత్యధిక చిత్రాల చేసిన దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. 2017 మే 30న మనకు భౌతికంగా దూరమయినా ఆయన తీసిన అజరామ సినిమాలు మన తెలుగు సినీ రంగానికి అపురూపం తతరాలుకు తరగని గనిభాండారం. దాసరి నారాయణరావు దర్శకునిగా పరిచయమైంది 1972లో ‘తాతమనవడు’తో. ఆ సినిమా ఇప్పుడు చూసినా మనసును కదిలిస్తోంది.

Exit mobile version