సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే బడ్జెట్ పెరిగిపోతుంది. బడ్జెట్ పెరిగితే నిర్మాతల లెక్కలు అన్ని తారుమారు కావలిసిందే. ఇక పెద్ద చిత్రాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సినిమాలు సకాలంలో పూర్తి అయ్యి విడుదల అయినప్పుడే నిర్మాతకు లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఉంటుంది. కాగా ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న అంశం అదే. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ గత మూడు నెలలుగా ఆగిపోయింది. బయట షూటింగ్స్ నిర్వహించుకొనే అవకాశం లేకపోవడంతో కోట్లు వెచ్చించి భారీ సెట్స్ నిర్మించాల్సివస్తుంది.
ఈ విధంగా నిర్మాణ భారం అంతకంతకు పెరిగిపోతుంది. మరో ఏడాది సమయం ఈ సినిమా విడులకు పట్టేలా కనిపిస్తుండగా అప్పటివరకు పెట్టుబడిపై వడ్డీల భారం ఉంటుంది. దీనికి తోడు ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా ఆ స్థాయి వసూళ్లు సాధించాలంటే కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి, యథావిధిగా థియేటర్స్ పని చేయాలి. ప్రజల్లో ఈ వైరస్ భయం పూర్తిగా పోయినప్పుడే థియేటర్స్ కి వచ్చి సినిమా చూడడం జరుగుతుంది. ఈ ఆలోచనలు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ని బెంబేలెత్తిస్తున్నాయి.
