లేటెస్ట్ గా తమిళ్ సినిమా నుంచి వచ్చిన చిత్రాలు సర్దార్ 2 అలాగే మండాడి ల కోసం అందరికీ తెలిసిందే. కార్తీ, సూరి, సుహాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. అయితే ఈ చిత్రాల్లో సర్దార్ 2 కొంచెం సెపరేట్ లీగ్ అనుకోవచ్చు. సీక్వెల్ హైప్, పైగా కార్తీ హీరో ఇలాంటివి సర్దార్ 2 ని మండాడి కంటే ఒక మెట్టు పైనే ఉంచాయి మొదటి నుంచీ..
కానీ ఒక్కసారి థియేటర్స్ విడుదల అయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. సర్దార్ 2 ని భారీ లెవెల్లో సూరి సినిమా డామినేట్ చేసి చూపించింది. గత 24 గంటల టికెట్ సేల్స్ లో కార్తీ సినిమాకి కనీసం 50 వేల టికెట్స్ కూడా అమ్ముడుపోలేదు. కానీ మండాడి మాత్రం 2 లక్షల టికెట్స్ కి పైగా సేల్ చేసుకుంది.
దీనితో డామినేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అది ఆ సినిమాకి పెద్ద విజయం అయితే సర్దార్ 2 కి టీం కి మాత్రం భారీ డౌన్ ఫాల్ అని చెప్పక తప్పదు. ఇక ఈ వారాంతంలో డెఫినెట్ గా మరింత లెవెల్లో ఇదే డామినేషన్ కనిపిస్తుంది అని చెప్పవచ్చు.
