బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో హిందీ పరిశ్రమలో దూసుకుపోతున్న తాప్సి ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. తన అనుభవాలన్నింటినీ ప్రేక్షకులు, అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అలాగే తాజాగా తనకు ముంబై పోలీసులు జరిమానా విధించిన విషయాన్ని కూడ చెప్పుకొచ్చింది తాప్సి. తాప్సి హెల్మెట్ లేకుండా బులెట్ బైక్ నడుపుతూ ముంబై ట్రాఫిక్ పోలీసుల కంటపడింది. వెంటనే పోలీసులు ఆమెకు నిబంధనలను పాటించనందుకుగాను జరిమానా వేసి చలానాను ఇంటికి పంపారు.
ఈ సంగతినే ఇన్స్టాగ్రమ్ ద్వారా చెప్పుకొచ్చింది తాప్సి. అయితే ఆమె బైక్ నడిపింది సినిమా షూటింగ్లో భాగంగానే. ప్రస్తుతం ఆమె ‘రష్మి రాకెట్’ అనే సినిమా చేస్తోంది. ఆ సినిమా చిత్రీకరణలో భాగంగా హెల్మెట్ లేకుండా బైక్ తో రోడ్డు మీదకు వచ్చింది. కానీ షూటింగ్ అయినా, నార్మల్ రైడ్ అయినా పోలీసులకు అనవసరం కదా.. అందుకే ఫైన్ వేసేశారు. ఇకపోతే తాప్సి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని ఇబ్బందులను, తిరస్కారాలను ఎదుర్కొన్నది వివరించింది. వాటిలో భాగంగా ఒక స్టార్ హీరో భార్య తనను సినిమాలో లేకుండా చేయడం గురించి కూడ చెప్పుకొచ్చింది. అప్పటి నుండి ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయంపై తెగ చర్చలు జరుగుతున్నాయి.
