సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రమే ‘వారణాసి’. గ్లోబల్ లెవెల్లో ఎంతో హైప్ ఉన్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ షూటింగ్ ఇంకా గ్రాఫిక్స్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.
అయితే ఇప్పుడు మేకర్స్ జార్జియాకి షిఫ్ట్ అయినట్టు కన్ఫర్మ్ అయ్యింది. సూపర్ స్టార్ జార్జియా ప్రయాణం అవుతున్న వీడియో విజువల్స్ కొన్ని అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. అయితే అక్కడ ఏ సీన్స్ తెరకెక్కిస్తారు అనేది కూడా తెలుస్తుంది. జార్జియాలో యాక్షన్ బ్లాక్ లు జక్కన్న తెరకెక్కిస్తారని టాక్.
ఇక ఇందులో మహేష్ బాబుతో పాటుగా సలార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఉంటారని తెలుస్తుంది. సో ఇలా వారణాసి సినిమా అంతర్జాతీయ లెవెల్లో గ్రాండ్ స్కేల్ తో తెరకెక్కుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా కే ఎల్ నారాయణ మరియు ఎస్ ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
