యంగ్ రెబల్ స్టార్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ స్వచ్ఛమైన ప్రేమ కావ్యంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. అయితే ఇటీవలే మిగిలి ఉన్న షూట్ ను పూర్తి చేసే పనిలో పడ్డ మేకర్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా క్లైమాక్స్ షూట్ పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యి ఉన్నారు.
అందులో భాగం గానే ఇప్పుడు ప్రభాస్ రాత్రి పగళ్లు తేడా లేకుండా కష్టపడుతున్నాడు. అయితే ఇటీవలే పలు ఆస్కతికర సీన్స్ ను తెరకెక్కించిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కేవలం ఒకే ఒక్కటి ఉంటుంది అది కూడా అదిరిపోయే రేంజ్ లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఈ నెల చివరిలోపు పూర్తి చేసేయనుండగా వచ్చే నెల జనవరి నుంచే “సలార్” షూట్ లో పాల్గొననున్నారు.
