ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కలయికలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘కాకా’ గా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ కి కూతురుగా యంగ్ హీరోయిన్ అనస్వర రంజన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
కానీ మెగాస్టార్ సరసన ఎవరైనా నటి కనిపిస్తారా అనేది ఇప్పుడు వరకు తెలియరాలేదు. అయితే దీనికి సమాధానం ఇప్పుడు దొరికేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ సీనియర్ నటి స్నేహ ఆ గోల్డెన్ ఛాన్స్ ని ఒడిసి పట్టినట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇది వరకే స్నేహ మెగాస్టార్ వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే.
సో ఇప్పుడు తండ్రితో కలిసి కనిపించనుంది అని చెప్పొచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కే వి ఎన్ సంస్థ నిర్మాణం వహిస్తున్నారు.
