రేపు డిసెంబర్ 9న మెగా డాటర్ నిహారిక కొణిదెల కు చైతన్య జొన్నలగడ్డ తో గ్రాండ్ గా వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ లో నిహారిక తండ్రి మెగా బ్రదర్ నాగబాబు పరిమిత అతిధులతో చాలా రాయల్ గా ప్లాన్ చేశారు. అయితే మెగా ఫ్యామిలీలో ఎంతో ఇష్టమైన నిహారిక పెళ్ళికి సిద్హం అవుతుండడంతో ఆ ఆనందాన్ని ఎమోషనల్ గా మెగా కుటుంబం ఆస్వాదిస్తూ తమ అభిమానులతో పంచుకుంటున్నారు.
అలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన నిహారిక విషయంలో ఒక అద్భుతమైన పోస్ట్ ను పెట్టారు. తన చేతిలో ఎత్తుకొని ఉన్న చిన్నప్పటి నిహారిక ఫోటోను అలాగే ఇప్పుడు పెళ్లి కుమార్తెగా రెడీ అయ్యి కలిసి ఉన్న ఫోటోను కలిపి ఒక పోస్ట్ పెట్టారు. “మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యు” అంటూ ఇద్దరికీ తన ఆశీస్సులను చిరు అందజేశారు.
మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! #NisChayWedding @IamNiharikaK pic.twitter.com/eLLPcZcYZV
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2020
