కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇంతకు ముందులా విపరీతమైన స్థాయిలో లేకపోయినా కేసులు వస్తూనే ఉన్నాయి. సామాన్యు జనంలోనే కాదు సినిమా పరిశ్రమలోనూ కరోనా తాకిడి కనిపిస్తూనే ఉంది. షూటింగ్లు రీస్టార్ట్ అయినప్పటి నుండి నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమల్లోని చాలామంది నటులు కరోనాకు గురికాగా తాజాగా తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడ కరోనాకు ఎఫెక్ట్ అయ్యారు.
ఈ విషయాన్ని ఆయన కుమార్తె, ప్రముఖ నటి వరలక్ష్మి తెలియజేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారని, కోలుకుంటున్నారని, అంతా బాగానే ఉందని, మంచి వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ సంగతి తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలి ప్రార్థిస్తున్నారు. పలువురు తమిళ సినీ ప్రముఖులు సైతం ఆయన్ను పరామర్శిస్తున్నారు. ఇకపోతే మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
