నాగార్జునతో చేతులు కలిపిన జక్కన్న.. మన దగ్గరే వరల్డ్ క్లాస్ టెక్నాలజీ!

S.-S.-Rajamouli

తన సినిమాలతో భారతీయ సినిమాని ముఖ్యంగా తెలుగు సినిమాని మరో లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. తన ఒకో చిత్రంతో స్కేల్ ని పెంచుతూ భారీ లెవెల్లో చేస్తున్న సినిమాలు థియేటర్స్ లో ఆడియెన్స్ కి ఒక మర్చిపోలేని అనుభూతిని అందిస్తున్నాయి. అయితే తన సినిమాల్లో చాలా వరకు విజువల్స్ కి అనేక హాలీవుడ్ సినిమాల్లో వినియోగించే మోషన్ కాప్చర్ టెక్నాలజీని ఇప్పుడు మన దగ్గరకే తీసుకొచ్చేసారు.

హైదరాబాద్ లో కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లో మిహిరా విజువల్స్ ల్యాబ్ ఇంకా ఆనిమాట్రిక్ హాలీవుడ్ స్టూడియోస్ తో చేతులు కలిపి ఒక సెపరేట్ స్టూడియోని మన దగ్గరే సెట్ చేసి వరల్డ్ క్లాస్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇక దీనిపై రాజమౌళి ఆనందం వ్యక్తం చేస్తూ వీడియో బైట్ లో విశేషాలు తెలిపారు. అంతే కాకుండా ఇప్పుడు తన నుంచి రాబోతున్న అవైటెడ్ సినిమా “వారణాసి” (Varanasi) లో సన్నివేశాలు కూడా చాలానే ఈ స్టూడియోలోనే తెరకెక్కించినట్టు తెలిపారు.

అలాగే కింగ్ నాగ్ కూడా ఇలాంటి వినూత్న టెక్నాలజీ మన సినిమా కోసం తీసుకురావడంలో భాగమైనందుకు తాను కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. సో ఇక నుంచి మోషన్ కాప్చర్ టెక్నాలజీలో సినిమాలు చేయాలి అంటే మన వాళ్ళు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. అలాగే ఇతర దేశాల నుంచి కూడా మన దగ్గరికే చాలా మంది రావచ్చు.

Exit mobile version