ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫ్రెండ్లీగా ఉన్న వారాంతా ఇప్పుడు సీజన్ ముగుస్తున్న సమయంలో అన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా బిగ్ బాస్ ఎవరి ఆట వాళ్ళే ఆడాలి ఒకరికోసం ఒకరు త్యాగాలు లాంటివి చెయ్యకూడదని స్మూత్ వార్నింగ్ ఇవ్వడంతో ఇక నుంచి ఎంటర్టైన్మెంట్ మరో లెవెల్లో ఉంటుంది అని అర్ధం అయ్యిపోయింది.
ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే నిన్నటి ఎపిసోడ్ లో అరియనా మరియు సోహెల్ లకు మధ్య రేగిన చిచ్చు ఇంకా పెరిగినట్టుగా ఈరోజు ఎపిసోడ్ లో తెలిసేలా ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో అరియానాకు ఎంతో ఇష్టమైన బొమ్మను సోహెల్ బయటకు విసిరెయ్యడం అనే పాయింట్ పై ఇద్దరికీ పెద్ద గొడవే జరిగేలా ఉంది.
ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు గట్టిగానే వార్నింగ్ లు ఇచ్చుకున్నట్టుగా లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఇక అలాగే ఈ ఎపిసోడ్ తో చాలా కాలం పాటు కోపాన్ని అణిచి ఉన్న సోహెల్ కూడా మళ్ళీ ఓల్డెన్ డేస్ లోకి వెళ్ళిపోయినట్టు అయ్యింది. వీరిద్దరి గొడవతో రసవత్తరంగా అనిపిస్తున్న ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
Heated argument between #Sohel & #Ariyana ???? #BiggBossTelugu4 today at 10 PM on @StarMaa pic.twitter.com/Kuke9hHGfH
— Starmaa (@StarMaa) December 9, 2020
