80 శాతం పూర్తయిన అనిల్ రావిపూడి “గాలి సంపత్”.!

gali sampath
మన టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరైన అనీల్ రావిపూడి సమర్పిస్తున్న తాజా చిత్రం “గాలి సంపత్”. ఇప్పుడున్న యువ హీరోల్లో మంచి టాలెంట్ ఉన్న వారిలో శ్రీవిష్ణు కూడా ఒకడు. మరి ఈ టాలెంటెడ్ హీరో కథానాయకుడిగా యువ దర్శకుడు అనీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక లేటెస్ట్ అండ్ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టుగా మేకర్స్ తెలుపుతున్నారు.

ఆ మధ్య విశాఖలో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ నేటితో పూర్తి కావడమే కాకుండా మొత్తం 80 శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యినట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనలలో సరైన జాగ్రత్తలు తీసుకొంటూ ఈ షూట్ ను పూర్తి చేసారు. అయితే ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. అలాగే మంచి ఎమోషన్స్ మరియు అనీల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా ఈ చిత్రంలో ఉంటాయట.ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version