“ఉప్పెన” విడుదలపై ఇదేనా అసలైన క్లారిటీ.!

Uppena

మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో యువ హీరో వైష్ణవ్ తేజ్. తన మొట్ట మొదటి చిత్రం గా “ఉప్పెన” అనే క్లీన్ లవ్ స్టోరీతో మంచి డెబ్యూ అందుకోవాలని చూస్తున్నాడు. కానీ కరోనా వల్ల ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. మధ్యలో సాలిడ్ ఓటిటి ఆఫర్స్ వచ్చాయి కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా విషయంలో ఎక్కడా తగ్గలేదు.

చాలా కాన్ఫిడెంట్ గా థియేట్రికల్ విడుదలకే రెడీ అయ్యారు. అయితే ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధరకు కొనుగోలు చేసారని టాక్ వచ్చింది. అయితే ఆ మాట నిజమే కానీ ఈ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్ విడుదల అయితే కాదని సమాచారం.

మొదటగా థియేటర్స్ లో విడుదల చేసిన తర్వాత మాత్రమే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి తీసుకురానున్నారని లేటెస్ట్ టాక్. ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించారు. అలాగే కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version