ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం “ఆచార్య”. సైరా లాంటి భారీ పీరియాడిక్ చిత్రం అనంతరం తెరకెక్కిస్తున్న సినిమా కావడం అందులోను రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుండడంతో దీనిపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో రియల్ హీరో సోను సూద్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య షూట్ లో పాల్గొనగా చిరు సోనూ సూద్ కు ఈ లాక్ డౌన్ లో అతను చేసిన సేవకు గాను సత్కరించారు. అయితే లేటెస్ట్ గా సోనూ చెప్పిన ఓ మాట బయటకు వచ్చింది. ఈ సినిమాలోని తనని చిరు కొట్టే సన్నివేశం వస్తుంది..
అప్పుడు చిరు “మీరు ఈ సినిమాలో ఉండడం చాలా ప్రాబ్లెమ్ గా ఉండండి నేను మిమ్మల్ని కొట్టలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని కొడితే ప్రజలు నన్ను శపిస్తారు” అని అన్నారని సోనూ సూద్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
