
ఇంకా కొన్ని గంటల్లో మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అన్నది తేలిపోనుంది. మరి ఈ సమయంలో ఇంకా కొన్ని అంశాల్లో మాత్రం ఈ ఫైనల్స్ పై ఆడియెన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అన్నది రివీల్ చెయ్యలేదు కానీ మంచి ఎలిమెంట్స్ చాలానే దాచి ఉంచినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే లక్ష్మి రాయ్ అలాగే మెహ్రీన్ ప్రణీతలతో అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ లను ప్లాన్ చేసిన మేకర్స్ థమన్ తో కూడా ఒక ప్రోగ్రాం ను అరేంజ్ చేసినట్టుగా టాక్. అలాగే చీఫ్ గెస్ట్ గా కూడా ఊహించని వారే వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ ఒక్క అంశం మాత్రం మరింత ఆసక్తిగా మారింది. మరి ఈ ఫైనల్స్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూడాలి. అలాగే ఈ రోజుతో ఈ సీజన్ కు తెర పడి అతి త్వరలోనే మరో సీజన్ కూడా మొదలు కానుంది.