సోషల్ మీడియా లో సత్తా చాటుతున్న మహేష్..!

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో తరచూ యాక్టిివ్ గా ఉంటారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా లో కూడా మహేష్ తన సత్తా చాటుతున్నారు. ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన సౌత్ హీరో గా మహేష్ రికార్డ్ సాధించారు. ఇప్పటి వరకు 11 మిలియన్ల మంది కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

అయితే మహేష్ కి 11 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #11millionmaheshians హ్యష్ ట్యాగ్ ను సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అయితే మహేష్ ఇప్పటికే ఇన్ స్టాగ్రాం లో 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, ఫేస్ బుక్ లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ టాలీవుడ్ లో ఎక్కువ ఫాలోవర్లు కలిగిన హీరో గా ఉన్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Exit mobile version