ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొత్తం నాలుగు భారీ ప్రాజెక్టులను టేకప్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే వాటిలో ఒక్కో దానిపై కూడా ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే వీటిలో విజువల్ పరంగా చాలా కాస్ట్ మరియు మేకర్స్ ఎంత వరకు అయినా సరే పెట్టడానికి రెడీ కాబడిన చిత్రం “ఆదిపురుష్”.
బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించనున్న ఈ భారీ మైథలాజికల్ వండర్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించనుండగా సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో కనిపించనున్నాడు.
అయితే అంతకు మించి ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ లా తెరకెక్కించాలని ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. బడ్జెట్ లో దాదాపు అందుకే ఎక్కువ పెట్టనున్నారు. మరి ఇప్పుడు వారికున్న ఈ గ్యాప్ లో ఆదిపురుష్ టీం అదే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది.
ఆదిపురుష్ లోని ఆర్ట్ వర్క్ మరియు డిజైన్స్ పనులు ఇప్పుడు జరుగుతున్నట్టు టాక్. ఇక ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఎవరు అన్నది డిసైడ్ కాలేదు. మర్రి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
