టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా మహాంకాళి మూవీస్ బ్యానర్‌పై మహాంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం బ్లాక్. కొత్త దర్శకుడు జిబి కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 23న ఆది పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను దర్శక నిర్మాతలు విడుదల చేసారు. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పాలి.అలాగే ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆది నటిస్తున్నాడు.
మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదికి జోడీగా దర్శన బానిక్ నటిస్తున్నారు. లాక్‌డౌన్ కంటే ముందుగానే ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తి చేసారు మేకర్స్. ఇక ఈ చిత్రంలో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మందా, ఆమని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. అమర్ రెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తుండగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ నుంచి తొందరలోనే రానున్నాయి.
