వెంకీ మామ డబుల్ డోస్ కామెడీతో “ఎఫ్ 3” షూట్ స్టార్ట్.!

f3 2
మన స్టార్ హీరోలలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ కామెడీకి అయితే ఇప్పటికీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి చాలా కాలం తర్వాత వెంకటేష్ నుంచి ఫుల్ లెంగ్త్ కామెడీని చూసింది మాత్రం “ఎఫ్ 2” సినిమాలోనే అని చెప్పాలి. టాలెంటెడ్ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటించిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది.

మరి ఈ చిత్రానికి డబుల్ డోస్ గా ఇటీవలే “ఎఫ్ 3” చిత్రాన్ని మేకర్స్ అనౌన్స్ చేసేసారు. మరి లేటెస్ట్ గా అయితే వెంకీ మామ షూట్ తోనే ఈరోజు నుంచే ఈ చిత్రం షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిపోయినట్టు మేకర్స్ వెల్లడి చేసేసారు. మరి ఈ చిత్రాన్ని ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిస్తున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు. ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version