ప్రభాస్ లాంటి ఒక యాక్షన్ కటౌట్ కు ఒక పవర్ ఫుల్ యాక్షన్ డైరెక్టర్ తోడైతే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది. మరి అలాంటి ఒక కాంబోనే లేటెస్ట్ గా అనౌన్స్ చేసి మరోసారి పాన్ ఇండియన్ వైడ్ రచ్చ చేసేందుకు సిగ్నల్ ఇచ్చేసాడు. కన్నడ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తెరకెక్కించనున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” ప్రకటనతో ఒక్కసారిగా మంచి హైప్ సంతరించుకున్నారు.
ఇక అలాగే మరోపక్క క్యాస్టింగ్ పరంగా కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ తగు జాగ్రత్తలే తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ దిశా పటాని పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో టాక్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాకు గాను నీల్ ఇద్దరు ఫిమేల్ లీడ్స్ ను అనుకుంటున్నట్టుగా ఇప్పుడు సమాచారం. మరి ఇంకా ఆ రోల్ లో ఎవరిని ఫిక్స్ చేసారో తెలియలేదు కానీ ఇద్దరు హీరోయిన్స్ అయితే ఈ చిత్రంలో ఫిక్స్ అనే టాక్. మరి ఏం జరగనుందో కాలమే నిర్ణయించాలి.
