
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ “సలార్”. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానుంది. అయితే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు గాను మేకర్స్ ఆల్రెడీ టార్గెట్ ను పెట్టేసుకున్నారని తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసేయాలని ప్లాన్ సిద్ధం చేశారట. ఇది ఇంతకు ముందు ప్రభాస్ కు కానీ నీల్ కు గాని ఎప్పుడు తీసుకోని డెసిషన్ అని చెప్పాలి. అలాగే ఈ చిత్రాన్ని ఆ నాలుగు నెలల్లో పూర్తి చేసేసి దసరా సీజన్లో విడుదల చేసేస్తారని టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే నీల్ క్యాస్టింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.