బయటకొచ్చాక మరింత పెరిగిన అభిజీత్ క్రేజ్..కానీ?

abijeet

ఈసారి జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ లో విజేతగా యుంగ్ కంటెస్టెంట్ అభిజీత్ భారీ ఓటింగ్ తో నిలిచిన సంగతి తెలిసిందే. చాలా సెటిల్డ్ అండ్ మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ తో అభిజీత్ సినిమాల్లో కంటే చాలా మందికే దగ్గరయ్యాడు. అంతేనా అంతకు ముందు బిగ్ బాస్ షో చూడని వాళ్ళని కూడా చూసేలా చేసి తనకు ఓట్ చేయించుకోగలిగాడు. అక్కడే ట్రూ విన్నర్ గా అయ్యాడు.

అయితే ఇంతకు ముందు ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ కు చెయ్యని రచ్చ సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ చేసారు. ఫైనల్ గా విన్నర్ గా నిలిపారు. అయితే అభిజీత్ కు బయటకొచ్చాక కూడా అంతే క్రేజ్ నిలిచింది అని చెప్పాలి. అంతే కాకుండా అతని ఇంటర్వూస్ కొన్ని సందర్భాలపై మాట్లాడిన విధానం అతన్ని మరో మెట్టు ఎక్కించేలా చేసింది.

ఇది ఖచ్చితంగా అతనికి మరింత గుర్తింపు తీసుకొచ్చే అంశమే కానీ ప్రస్తుతానికి అయితే అభిజీత్ కు సోహెల్ మాదిరి సరైన ఆఫర్స్ వచ్చిన టాక్ అయితే ఇంకా రాలేదు. మరి అభిజీత్ కూడా మునుపటి విన్నర్స్ జాబితాలో నిలిచిపోతాడా లేక వారికి భిన్నంగా మంచి అవకాశాలు దక్కించుకుంటాడా అన్నది చూడాలి.

Exit mobile version