ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు కూడా చాలానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం లాక్ డౌన్ కు ముందే చాలా మేర సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇంకా ఇప్పుడు లాక్ డౌన్ అనంతరం మళ్ళీ షూట్ రీస్టార్ట్ అయ్యింది.
ఇందులో పవన్ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే చాలా తక్కువే షూట్ ఉన్న ఈ చిత్రం ఎంతకీ కంప్లీట్ కావడం లేదా అని కూడా అనిపించొచ్చు. మరి దీనికి సంబంధించి తాజా టాక్ ఒకటి వినిపిస్తుంది. నిజానికి మేకర్స్ చెప్పిన దానికంటే కాస్తంత ఎక్కువే షూట్ బ్యాలన్స్ ఉందట.
అంతే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో మరిన్ని సీన్స్ యాడ్ చెయ్యడం మూలాన వకీల్ సాబ్ కు షూట్ మరింత పెరిగింది అని టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం ఇస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.
