ఇప్పటికీ “ఆదిపురుష్”కు ఆమెనే..!

adipurush
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ ప్రాజెక్టులలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. అయితే భారీ ఇతిహాస చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటించనున్నాడు.

ఇక అలాగే ఇతర క్యాస్టింగ్ కు సంబంధించి మాత్రం గత కొన్నాళ్ల నుంచి మంచి బజ్ అలా వినిపిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కీలక పాత్ర అయినటువంటి సీతగా ఎవరు కనిపిస్తారు అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రోల్ కు గాను చాలా మంది పేర్లే ఇప్పటి వరకు వినిపించినా ఫైనల్ గా మాత్రం కృతి సనన్ పేరే ఫైనలైజ్ అయ్యేలా ఉందని తెలుస్తుంది.

మొదటి నుంచీ ఈమె పేరు గట్టిగానే వినిపిస్తూ వచ్చింది. కానీ సినిమాలో ఫైనల్ గా ఉండేది ఈమెనే అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ భారీ చిత్రంలో ఈమె కనిపిస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మేకర్స్ 3డి లో భారీ విజువల్స్ ఇంతకు ముందు ఇండియన్ సినిమాలో రాని విధంగా తెరకెక్కించేలా సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version