మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే పవర్ ఫుల్ సబ్జెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కేవలం చిరు ఉన్నారని మాత్రమే కాకుండా ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుండడం మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంకా ఈ చిత్రంలో చరణ్ పై సన్నివేశాలు షూట్ మొదలు కాలేదు.
కానీ లేటెస్ట్ గా చరణ్ ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఫోటోలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి తన షూటింగ్ కోసమా లేక జెనరల్ గా వెళ్ళినట్టా అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం అయితే చరణ్ కు ఫిమేల్ లీడ్ సెర్చ్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి మెగాస్టార్ ఆల్ టైం హిట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బాణీలు అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
