మారుతి రవితేజతోనే ఫిక్స్.. టైటిల్ పక్కా మాస్ అట ?

maruthi ravi teja

దర్శకుడు మారుతి ప్రతిరోజు పండుగే సూపర్ సక్సెస్ తరువాత ఎలాంటి సినిమా చేస్తాడా ? ఏ హీరోతో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణంలో.. ఇప్పటికే మారుతి సినిమా పై అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తన కొత్త సినిమా స్క్రిప్ట్ పై ఇప్పటివరకూ కూర్చున్న మారుతి, తన కొత్త ప్రాజెక్ట్ కోసం మాస్ మహారాజా రవితేజతో కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ను పక్కా మాస్ అని కూడా అనుకుంటున్నారట.

ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ చిత్రం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య రవితేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని వినిపించినా అది నిజం కాదని తెలుస్తోంది. మరోపక్క ‘మారుతి – నాని’ కాంబినేషన్ లో మళ్ళీ మరో సినిమా రాబోతుందని కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా ద్వారా బాగానే కోరుకున్నారు. అందుకే రవితేజతో సినిమా తరువాత మారుతి నానితో సినిమా చేస్తాడట.

Exit mobile version