విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘విక్రమ్’. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఇక తాజా సమాచారం మేరకు ఇందులో ప్రముఖ కొరియగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన ప్రభుదేవా ఒక కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే గనుక నిజమైతే కమల్, ప్రభుదేవాలు 22 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నట్టు అవుతుంది. 1998లో కమల్ హాసన్ చేసిన ‘నవ్వండి లవ్వండి’ చిత్రంలో ప్రభుదేవా నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నది లేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తున్నట్టు కొలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి చూడాలి ఈ వార్తలు ఎంతవరకు నిజమో. ఇకపోతే తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాను తమిళానాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు కమల్.
