ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఇరుముడి కోసం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే కాకుండా టోటల్ టాలీవుడ్ లోనే ఒక రికార్డ్ బ్రేకింగ్ హిట్ గా నిలిచిన ఈ సినిమా థియేటర్స్ లో ఇంకా మంచి రన్ కొనసాగుతున్నప్పటికీ ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నేటి నుంచి ఈ సినిమా అందులో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. దాదాపు తెలుగు ఆడియెన్స్ ఎవరూ థియేటర్స్ లో మిస్ అయ్యి ఉండరు. ఒకవేళ అలా కుదరకపోతే ఇప్పుడు ఈ ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ డివోషనల్ డ్రామాని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version