
షారుఖ్ ఖాన్ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిలేరియస్ వీడియోను షేర్ చేశారు. అలాగే నూతన సంవత్సరం సందర్బంగా తనకు సుదీర్ఘమైన సందేశాలను పంపవద్దని అభిమానులని కోరారు. ఈ వీడియోలో ఈగలు మరియు దోమలతో ఇబ్బంది పడుతూ కనిపించిన షారుఖ్ తన సిబ్బంది అందుబాటులో లేనందున తానే ఇవన్నీ స్వయంగా చేస్తున్నానని,ఈ అసౌకర్యానికి క్షమాపణలని చెప్పి నవ్వులు పూయించారు.
నైట్ సూట్‌లో తన సందేశాన్ని రికార్డ్ చేయడానికి కెమెరా ముందు కూర్చున్నప్పుడు షారుఖ్ తన జుట్టును సరిచేసుకుంటూ ఫన్నీగా మొదలుపెట్టి మాట్లాడుతూ… ఇలాంటి భయంకరమైన సంవత్సరాన్ని తిరిగి చూడకూడదని మరియు కష్ట సమయాలలో ధైర్యంగా ముందుకెళ్లే మార్గాన్ని ఆయన పంచుకున్నాడు. గత సంవత్సరం మనల్ని కిందకి నెట్టివేసింది, మంచి విషయం ఏమిటంటే,ఇక ఇక్కడ నుండి పైకి మాత్రమే వెళ్ళటానికి అవకాశం ఉంది. 2021 మనందరికీ మంచిగా, ప్రకాశవంతంగా మరియు మరింత అందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం నేను మీ ముందుకు బిగ్ స్క్రీన్ ద్వారా తప్పకుండా వస్తానని అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు.
Here's wishing you all a safe, happy and prosperous 2021… pic.twitter.com/COgpPzPEQJ
— Shah Rukh Khan (@iamsrk) January 2, 2021