“పుష్ప” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Pushpa

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “పుష్ప”. ఇప్పటికే మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంను సుకుమార్ అదిరిపోయే రీతిలో ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ తమ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రంగంలోకి దిగడమే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో చిత్ర యూనిట్ మరో కీలక యాక్షన్ సన్నివేశం షూట్ తో దానిని ముగించారు. మరి ఇప్పుడు రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ షెడ్యూల్ ను వచ్చే వారంలో మేకర్స్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అది పాట కాదు యాక్షన్ సన్నివేశం కాదు నార్మల్ డ్రామా సన్నివేశం అన్నట్టు టాక్ అది కూడా ఎంతో కీలకమైన షాట్ నే తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version