వరుస విజయాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొడుతూ వెళుతున్న దర్శకుడు అనీల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది గత కొన్ని రోజులు ఆసక్తిగా మారింది. మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రికార్డులు బ్రేక్ చేశారు. అయితే ఆ తదుపరి వెంకీమామ తోనే ఉంటుంది అని ఖరారు అయ్యింది కానీ ఇది కూడా ఓ మల్టీస్టారర్ అంటూ టాక్ వచ్చింది.
దీనితో ఆ మరో హీరో ఎవరు అనేది చాలానే రచ్చ నడిచింది. కానీ ఒక ఊహించని హీరోని ఈ ప్రాజెక్ట్ కోసం అనౌన్స్ చేసి అనీల్ ట్విస్ట్ ఇచ్చాడు. తన మొదటి సినిమా హీరో ‘పటాస్’ నందమూరి కళ్యాణ్ రామ్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
తన మొదటి హీరో మొదటి 100 కోట్ల హీరో కాంబినేషన్ లో నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నట్టు అనౌన్స్ చేసి అపుడే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో తన సినిమాకి గట్టి మార్క్ ని సెట్ చేసేసుకున్నారు. సో ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం అంతా మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. Victory @VenkyMama గారితో🔥
"మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి 💥
2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం 😍😍😍#VenkyAnil5 #NKRxAR pic.twitter.com/WRVWdbQpbz
— Anil Ravipudi (@AnilRavipudi) February 26, 2026
